
‘కెజిఎఫ్’ తర్వాత కన్నడ హీరో యాష్ పాన్ ఇండియా హీరో అయ్యారు. ప్రజెంట్ ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే చేసిన ‘కెజిఎఫ్ 2’ జూలై 16న విడుదలకానుంది. ఈ సినిమా మీద అన్ని పరిశ్రమల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలతో యాష్ ఫేమ్ పెరగడమే కాదు ఆయన మీద బరువు బాధ్యతలు కూడ పెరిగాయి. ‘కెజిఎఫ్’ లాంటి భారీ సినిమాల తర్వాత యాష్ ఎలాంటి సినిమా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఆయనలో కూడ ఆ టెంక్షన్ ఉంది.
అందుకే బాగా ఆలోచించిన ఆయన తన తర్వాతి సినిమా కూడ ‘కెజిఎఫ్’ తరహాలోనే భారీగా ఉండాలని భావిస్తున్నారట. అందుకే నార్తన్ డైరెక్షన్లో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. నార్తన్ గతంలో ‘మఫ్టీ’ అనే సినిమా చేశారు. శ్రీమురళి, శివరాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసి మెచ్చిన యాష్ నార్తన్ ను తన కోసం కథను సిద్ధం చేయమని అడిగారట. దాంతో నార్తన్ యాష్ కోసమే మూడు కథలను రెడీ చేయగా వాటిలో ఆయనకు ఒక కథ చాలా బాగా నచ్చిందట. ఇదే ‘కెజిఎఫ్’ తరవాత తన స్థాయిని నిలబెట్టగలిగే కథని యాష్ నమ్ముతున్నారట. అందుకే ఆ కథను ఫైనల్ చేసి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

