
ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బాలయ్య ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు సెట్టైన సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యలోనే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సంబంధించి డేట్ కూడా వచ్చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ లో అంచనాలు మరింత పెరిగాయి.
అయితే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ విషయంలో మాత్రం ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. మరి ఈ మిస్టరీకు స్వయంగా బోయపాటినే తెర దించనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే గత కొన్నాళ్ల నుంచి సినీ వర్గాల్లో సర్క్యులేట్ అవుతున్న “మోనార్క్” నే ఫిక్స్ చేసినట్టు కూడా ఇపుడు స్ట్రాంగ్ బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా తొందరలోనే రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ యాక్షన్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

