సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. కాగా తాజాగా కీర్తి సురేష్ సెకెండ్ షెడ్యూల్ షూట్ లో నేటి నుండి పాల్గొనబోతుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ తన పిక్ ను కూడా పోస్ట్ చేసింది. ఇక చిత్రబృందం ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసిందే. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే.
ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.


