స్టార్ హీరో అభిమానులకు గుడ్ న్యూస్

స్టార్ హీరో అభిమానులకు గుడ్ న్యూస్

Published on Feb 15, 2021 11:16 PM IST

Ajith Kumar
అజిత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘వాలిమై’. లాక్ డౌన్ అనంతరం అజిత్ నుండి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నా సినిమా ఫస్ట్ లుక్ విడుదలకాకపోవడంతో అభిమానుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఇప్పటివరకు అజిత్ సినిమాల విషయంలో ఫస్ట్ లుక్ ఇంకా ఆలస్యం కాలేదని అంటున్నారు.

వారి ఆవేదనను అర్థం చేసుకున్న చిత్ర నిర్మాత బోనీ కపూర్ సినిమా ఫస్ట్ లుక్ సిద్ధమవుతోందని, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిసస్తామని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజా సమాచారం మేరకు ఈరోజు లేదా రేపట్లో షూటింగ్ పూర్తవుతుందని, ఒక యాక్షన్ సన్నివేశాన్ని మాత్రం ఫారిన్ లొకేషన్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ చిత్రాన్ని తెరకెక్కించిన ‘ఖాకీ’ ఫేమ్ హెచ్.వినోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు