
మెగా కుటుంబం నుండి వచ్చిన డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో భారీ విజయాన్ని అందుకున్నాడు. గతంలో ఏ డెబ్యూ హీరోకి దొరకని భారీ విజయాన్ని వైష్ణవ్ తేజ్ సొంతం చేసుకున్నాడు. మొదటి వారాంతంలోనే 28.39 కోట్ల షేర్ వసూలు చేసి కొత్త రికార్డ్ కృయేట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడకుంటోంది. ఎమోషనల్ లవ్ స్టోరీ అనే పేరు తెచ్చుకోవడంతో సెలబ్రిటీలు సైతం త్వరపడి సినిమా చూస్తున్నారు. ప్రెజెంట్ స్టార్లు అందరూ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంత బిజీ టైంలో కూడ వారంతా ‘ఉప్పెన’ను వీక్షించేందుకు వీలు చూసుకుంటున్నారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఉప్పెన సూపర్ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు. సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ ట్వీట్ చేశారు. ఆలాగే శర్వానంద్, క్రిష్ జాగర్లమూడి, సుమంత్ ఇంకా ఎంతో మంది నటీనటులు, దర్శకులు సినిమా పట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ కొత్త హీరో వైష్ణవ్ తేజ్ కు మద్దతు ఇస్తుండటంతో చిత్రానికి బోలెడంత పాజిటివ్ పబ్లిసిటీ పభిస్తోంది. ఇప్పటివరకు సినిమా చూడని ప్రేక్షకులు సైతం సెలబ్రిటీల వ్యాఖ్యలతో థియేటర్ల వైవుకు కదులుతున్నారు. సినిమా వసూళ్ల జోరు ఈ వారం కూడ కొనసాగేలా కనిపిస్తోంది.

