సుశాంత్ ‘ఎం ఎస్ ధోనీ’ నటుడు ఆత్మహత్య.!

సుశాంత్ ‘ఎం ఎస్ ధోనీ’ నటుడు ఆత్మహత్య.!

Published on Feb 16, 2021 9:00 AM IST

sandeep nahar

గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎలాంటి విషాదాన్ని నెలకొల్పిందో అందరికీ తెలిసిందే. ఒకపక్క అదే అనుకుంటే మరోపక్క ఇండియన్ ఇండియన్ సినిమాకు చెందిన పలువురు ప్రముఖ నటులు మరణ వార్తలు మరింతగా కలచివేశాయి. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటనపై మిస్టరీ అయితే ఇంకా వీడలేదు.

మరి ఇదిలా ఉండగా ఇదే సుశాంత్ సింగ్ చేసిన బయోపిక్ ఎం ఎస్ ధోని లోని ఓ కీలక నటుడు ఆత్మ హత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఎం ఎస్ ధోని, కేసరి సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన సందీప్ నహర్ కొన్ని ఇబ్బందుల మూలాన ఆత్మహత్య చేసుకుంటున్నాని తన మరణానికి ఎవరూ కారణం కాదని ఓ లేఖలో పేర్కొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఎం ఎస్ ధోని సినిమాలో సుశాంత్ స్నేహితుని పాత్రలో కనిపించి మెప్పించిన ఈ టాలెంటెడ్ నటుడు ఇలా చేసుకోవడం బాధాకరం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు