నటి, యాంకర్ అనసూయకు ఈమధ్య సినిమా ఆఫర్లు బాగా పెరిగాయి. కొన్ని ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక గీతాల కోసం ఆమెను అప్రోచ్ అవుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా స్పెషల్ పాటల్లో మెరవడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కార్తికేయ హీరోగా రూపొందుతున్న ‘చావు కబురు చల్లగా’లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మీద మంచి బజ్ ఏర్పడి ఉంది. పాట గొప్పగా అలరిస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె గోపీచంద్, మారుతిల కాంబినేషన్లో వస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలో కూడ ఒక స్పెషల్ రోల్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. అది కూడ బోల్డ్ పాత్రని కొందరంటే అది వేశ్య పాత్రని ఇంకొందరు అన్నారు. వీటిపై స్పందించిన దర్శకుడు మారుతి అసలు తమ సినిమాలో అలాంటి పాత్రలేవీ లేవని, ఆమె తమ సినిమాలో అలాంటి పాత్ర ఏదీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మార్చి నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


