కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని చెప్పాలి. పలు చోట్ల ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలను కోల్పోయారు. అయితే ప్రముఖ నటుడు, రియల్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ నెల్లూరు జిల్లా లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కి సన్నాహాలు చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఆక్సిజన్ ప్లాంట్ రాక తో నెల్లూరు జిల్లా కి చెందిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. సోనూ సూద్ చిత్ర పటానికి హారతి పట్టి, టపాసుల తో తమ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమంది కి సహాయం చేశారు నటుడు సోనూ సూద్. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతోమందికి సహాయం చేసిన సోనూ సూద్ ను ప్రజలు రియల్ హీరో అంటూ చెప్పుకొస్తున్నారు.


