“రాధే శ్యామ్” రాకతో నెవర్ బిఫోర్ గా సంక్రాంతి పందెం.!

“రాధే శ్యామ్” రాకతో నెవర్ బిఫోర్ గా సంక్రాంతి పందెం.!

Published on Jul 30, 2021 5:00 PM IST

Radhe Shyam

అసలు ఇప్పుడు ప్రతీ ఒక్కరి లైఫ్ బుక్ లో కరోనా అనే పేజీ లేకపోతేనా ఇంకో లెవెల్లో ఉండేది.. అలాగే టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా పరిశ్రమ కూడా అలానే ఉండేది. కరోనా ఎంటర్ కాకుండా ఉంటే ఇప్పుడు రిలీజ్ డేట్స్ వెతుక్కుంటున్న పలు చిత్రాలను ఇప్పటికే మనం చూసేసి ఉండేవాళ్ళం.. అయినప్పటికీ ఏదొకలా పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో సినిమాలు ఒక్కక్కటిగా విడుదల అవుతున్నాయి.

అయితే మరి సినిమాలు అన్నాక కొన్నిసార్లు సోలో రిలీజ్ లు ఉంటాయి కొన్నిసార్లు పోటీ తప్పదు. కానీ ఆ పోటీ హీటెక్కించేదిలా ఉంటే ఆ ఊహ కూడా ఇంకో స్థాయిలో ఉంటుంది. మరి అలాంటి పోటీనే వచ్చే ఏడాది సంక్రాంతికి ఉంది. మామూలుగానే సంక్రాంతి పండుగ అంటే కొత్త సినిమాలతో పాటు ఇంకో పండుగ అన్నట్టే.. అలాంటిది ఒక స్టార్ హీరో సినిమా వస్తే హైప్ ఓ స్థాయిలో ఉంటుంది కానీ ఈసారి మాత్రం వార్ గట్టిగా ఉండేలా ఉందని చెప్పాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు ఆల్రెడీ తమ చిత్రాలతో టార్గెట్ సంక్రాంతికి ఫిక్స్ చేసుకోగా ఇప్పుడు సైలెంట్ స్ట్రామ్ గా తన పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్” తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. దీనితో ఈ మూడు సినిమాలతో వచ్చే ఏడాది సంక్రాంతి పందెం ఎలా ఉండబోతుందా అని ఇప్పుడు నుంచే ఆసక్తి మొదలయ్యింది. మరి ఈ బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు