మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్.. ‘స్పెషల్’ విన్నర్స్ వీరే..!

మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్.. ‘స్పెషల్’ విన్నర్స్ వీరే..!

Published on Mar 7, 2026 4:00 PM IST

Chiranjeevi

తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా ‘గద్దర్ చలనచిత్ర అవార్డుల’ను ఘనంగా ప్రకటించింది. దాదాపు 40 విభాగాల్లో ఈ పురస్కారాలను అందజేయనున్నారు. సినిమా రంగంలోని వివిధ శాఖల్లో విశేష కృషి చేసిన కళాకారులను గుర్తించి ఈ అవార్డులను అందజేయనున్నారు. కేవలం రాష్ట్రస్థాయి అవార్డులే కాకుండా, అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పురస్కారాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

2025 సంవత్సరానికి గానూ గౌరవప్రదమైన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ మెగాస్టార్ చిరంజీవిని వరించింది. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవకుగాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. అలాగే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి పురస్కారం’ దక్కింది. లోకనాయకుడు కమల్ హాసన్‌కు ‘పైడి జయరాజ్ అవార్డు’ను ప్రకటించగా, అలనాటి సహజ నటి జయసుధకు ‘అక్కినేని నాగేశ్వర రావు ఫిల్మ్ అవార్డు’ దక్కింది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ‘సినారె పురస్కారం’ అందుకోనున్నారు.

మరికొన్ని కీలక విభాగాల్లో.. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తికి ‘కాంతారావు అవార్డు’, దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ‘బి.ఎన్.రెడ్డి అవార్డు’, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్‌కు ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించాయి. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 19న ఈ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరగనుంది. ఈ అవార్డుల ప్రకటనతో అటు మెగా అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు