ఇండియా లో ట్రెండ్ అవుతోన్న టాప్ 3 “ఆర్ఆర్ఆర్” వే!

ఇండియా లో ట్రెండ్ అవుతోన్న టాప్ 3 “ఆర్ఆర్ఆర్” వే!

Published on Aug 5, 2021 5:18 PM IST

rrr 4

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం నుండి స్నేహితుల దినోత్సవం రోజున అయిదు భాషల్లో పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు యూ ట్యూబ్ ఇండియా లో మ్యూజిక్ విభాగం లో రౌద్రం రణం రుధిరం చిత్రం కి చెందిన ఈ దోస్తీ పాట మూడు భాషల్లో ట్రెండ్ అవుతోంది. అయితే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో టాప్ 3 గా కొనసాగుతున్నాయి. అయితే ఒక చిత్రానికి చెందిన పాట మూడు బాషల్లో ఇలా ట్రెండ్ లో కొనసాగడం పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో అలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో శ్రియ శరణ్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజా వార్తలు