శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం…హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

శ‌రణ్ కుమార్ కొత్త చిత్రం…హీరో లుక్‌ పోస్టర్‌ను ఆవిష్క‌రించిన సూప‌ర్‌స్టార్ కృష్ణ‌

Published on Aug 9, 2021 9:04 AM IST

Sharan Kumar
సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సినిమాలో హీరో లుక్ పోస్ట‌ర్‌ను ఆదివారం సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేశారు. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3 గా ఎం.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలో హీరో లుక్‌ను సూప‌ర్‌స్టార్ కృష్ణ రిలీజ్‌ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ, శరణ్ హీరోగా చేస్తోన్న సినిమా హీరో లుక్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని అన్నారు. ఇది త‌న‌కు హీరోగా ప‌ర్‌ఫెక్ట్ ల్యాండింగ్ అవుతుందని తెలిపారు. శ‌రణ్ యాక్ట‌ర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నా అని కృష్ణ చెప్పుకొచ్చారు.

నిర్మాత ఎం.సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ, శరణ్‌కుమార్ హీరోగా చేస్తున్న ఈ సినిమా హీరో లుక్ పోస్టర్‌ను మ‌హేశ్‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉందని, సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శ‌ర‌ణ్‌కు ఈ సినిమా క‌చ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని, అలాగే న‌రేశ్‌గారు, జ‌యసుధ‌గారు, సుధీర్‌బాబుగారు మా టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించ‌డం హ్య‌పీగా ఉందని అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలియ‌జేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు