‘టక్ జగదీష్’ కోసం పేరు మార్చుకున్న అమెజాన్ ప్రైమ్..!

‘టక్ జగదీష్’ కోసం పేరు మార్చుకున్న అమెజాన్ ప్రైమ్..!

Published on Aug 30, 2021 8:27 PM IST

amazon prime

న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 10న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన అమెజాన్ ప్రైమ్ తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్‌కు పేరు మార్చింది.

అయితే తాను హీరో నానికి పెద్ద ఫ్యాన్ అని, నాని ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్‌లో తమ హ్యాండిల్ పేరుకు ముందు ‘టక్’ పెట్టుకుంటే సర్‌ప్రైజ్ ఇస్తామని తెలిపింది. ఇక ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు