మెగా హీరో అల్లు శిరీష్ ఇటీవల హైదరాబాద్‌లో నయనికా రెడ్డిని వివాహం చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.
తాజాగా అల్లు శిరీష్ తన వివాహానికి సంబంధించిన ఒక అందమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. తన భార్య భుజంపై చేయి వేసి ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంటున్న ఈ స్టిల్ తనకెంతో ఇష్టమైన క్షణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మెగా అభిమానులు, నెటిజన్లు శిరీష్ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘బడ్డీ’ సినిమాతో అలరించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.


