‘డెకాయిట్’ నుంచి మరో ట్రీట్.. శేష్ ఏమన్నాడంటే..?

‘డెకాయిట్’ నుంచి మరో ట్రీట్.. శేష్ ఏమన్నాడంటే..?

Published on Mar 10, 2026 8:00 PM IST

Untitled 4 1

వరుస విజయాలతో జోరు మీదున్న అడివి శేష్, తన తాజా చిత్రం ‘డకోయిట్’ కోసం మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ మరియు రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అడివి శేష్ పోలీస్ వ్యాన్‌లో బందీగా, ఒళ్ళంతా రక్తపు మరకలతో ఉన్న తెల్లటి దుస్తుల్లో కనిపిస్తున్నాడు. చేతులకు, కాళ్లకు బేడీలు ఉన్నప్పటికీ, ఆయన ఎంతో ప్రశాంతంగా సిగరెట్ వెలిగిస్తూ కనిపించడం సినిమాలోని ఉత్కంఠను పెంచుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పోలీస్ ఆఫీసర్ గన్ గురిపెట్టి ఉండటం చూస్తుంటే, ఇది ఒక హై-టెన్షన్ యాక్షన్ సీక్వెన్స్‌ అని అర్థమవుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర బృందం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఒక పాటను చిత్రీకరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన ‘రుబారు’ సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం, ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు