ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ “జయహో ఇండియన్స్” ఫస్ట్ లుక్ విడుదల

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ “జయహో ఇండియన్స్” ఫస్ట్ లుక్ విడుదల

Published on Sep 1, 2021 12:12 PM IST

Jayaho Indians

రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా జయహో ఇండియన్స్. ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా కి ఆర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు? నాయకులా? అమాయకులా? దేశమా? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు