చిన్నారి చైత్ర తల్లిదండ్రులకి పవన్ ఆర్ధిక సాయం.!

చిన్నారి చైత్ర తల్లిదండ్రులకి పవన్ ఆర్ధిక సాయం.!

Published on Oct 9, 2021 4:41 PM IST

Pawan Kalyan 1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంతలా ఫాలోయింగ్ ఉంది అంటే ఒకటి అతని సినిమాలు వల్ల మరొకటి అతని వ్యక్తిత్వం వల్ల అని అంటారు చాలా మంది. అయితే అలా పవన్ ఇప్పటి వరకు ఎన్నో గుప్త దానాలు చేశారు. అవసరం ఉన్నవారిని అనేక మార్లు ఆదుకున్నారు.

మరి ఇటీవల తెలంగాణ లో జరిగినటువంటి దారుణ ఉదంతం చిన్నారి చైత్ర ఘటన పై స్పందించి కుటుంబీకులను కలిసి పరామర్శ కూడా చేసారు. అయితే ఈరోజు పవన్ తెలంగాణా లో తన పార్టీ మీట్ ఒకటి ఉన్నందున దానికి హాజరయ్యి ఈ సమక్షంలో చైత్ర తల్లిదండ్రులుకు రెండున్నర లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్టుగా ప్రకటించారు.

అంతే కాకుండా రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి చిన్నారి కుటంబం పట్ల వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరి ప్రస్తుతం అయితే పవన్ “భీమ్లా నాయక్” అలాగే “హరిహర వీరమల్లు” అనే మరో భారీ చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు