తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బాక్సాఫీస్ స్టార్డంకి ఒక బుక్ లాంటి వారని చెప్పొచ్చు. తరాలు మారిన మెగాస్టార్ తన మార్కెట్ తో ఎవర్ గ్రీన్ బాస్ గా తన మార్క్ చూపిస్తూ దుమ్ము లేపుతున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలకి పైగానే ఉన్న తన సినీ ప్రయాణంలో మెగాస్టార్ కి ఉన్న ఇండస్ట్రీ హిట్స్ లెక్క చాలా పెద్దదే.
‘ఖైదీ’ నుంచి ‘ఇంద్ర’ వరకు మొత్తం 8 ఇండస్ట్రీ హిట్స్ అందించి చరిత్ర సృష్టించిన మెగాస్టార్ తన కాలంలో హీరోలతోనే కాకుండా తనకి ముందు తన తర్వాత వచ్చిన హీరోలతో కూడా ధీటుగా నిలబడి ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం అనేది తనకే చెల్లింది అని చెప్పవచ్చు.
ఒకవేళ పాన్ ఇండియా, బాహుబలి, RRR లాంటి కొలమానాలు లేకుండా ఉంటే ఇప్పటికీ యువ స్టార్ హీరోలకి కూడా పోటీ ఇస్తూ ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్న హిట్ మెషిన్ గా మెగాస్టార్ మాత్రమే ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన రీఎంట్రీ ఇచ్చిన సినిమానే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాని తర్వాత వాల్తేరు వీరయ్య కూడా ఆ రేంజ్ లో దుమ్ము లేపింది కానీ కాలేకపోయింది.
బట్ ఇప్పుడు క్లాస్ సినిమాతో మెగాస్టార్ రికార్డుల పాతర వేశారు. దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా మేకర్స్ ప్రకటించారు. దీనితో ఆ జనరేషన్ అయినా ఈ జెనరేషన్ అయినా కూడా మెగాస్టార్ పేరిట హిస్టరీ మాత్రం అలానే ఉందని చెప్పొచ్చు.


