బాలయ్యతో కొరటాల సినిమా.. నిజమేనా ?

బాలయ్యతో కొరటాల సినిమా.. నిజమేనా ?

Published on Nov 16, 2021 1:18 AM IST

balayya koratala

క్లాస్ డైరెక్టర్ కొర‌టాల శివ‌ బాలయ్యతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రచయితగా ఉన్న సమయలోనే బాలయ్యకి కొరటాల ఓ కథ చెప్పాడని, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే కొరటాల ఇండ్ర‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు.

అందుకే, జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం, కొరటాల బాలయ్య బాబుతోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. బాలయ్య అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని కొరటాల ఫీల్ అవుతున్నాడట. మరి హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాసే కొరటాల, బాలయ్య కోసం ఎలాంటి కథ రాశాడో చూడాలి.

అలాగే వీరి కలయికలో వచ్చే సినిమా ఏ జోనర్ లో రానుంది ? సోషల్ సినిమానా ? లేక పీరియాడిక్ కథతో సినిమా ఉంటుందా ? అని అప్పుడే ఈ సినిమా పై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు