మెగా 158 కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టనున్న బాబీ..?

మెగా 158 కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టనున్న బాబీ..?

Published on Jan 25, 2026 1:01 AM IST

Mega-158

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా గ్రాండ్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగనున్నాయి. ఇదే ఊపులో చిరంజీవి తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కొల్లి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి ‘కాక’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను దర్శకుడు బాబీ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కు ఈ పేరు పక్కాగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఇందులో చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

అయితే, చిరు కుమార్తె పాత్రలో కృతి శెట్టి నటిస్తారనే వార్తలను చిత్ర బృందం ఖండించింది. ప్రస్తుతం ఇతర కీలక పాత్రల కోసం నటీనటుల వేట కొనసాగుతోంది.

తాజా వార్తలు