మాస్ బీట్ తో అదిరిపోయిన ‘టిల్లు స్క్వేర్’ నుండి ‘టికెటే కొనకుండా’ సాంగ్

మాస్ బీట్ తో అదిరిపోయిన ‘టిల్లు స్క్వేర్’ నుండి ‘టికెటే కొనకుండా’ సాంగ్

Published on Jul 26, 2023 9:36 PM IST

tillu2
యువ నటుడు సిద్దు జొన్నల గడ్డ హీరోగా ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్న తాజా సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి నేడు టికెటే కొనకుండా అనే పల్లవితో సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మేకర్స్.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రామో ఆకట్టుకోగా నేడు రిలీజ్ అయిన ఫుల్ సాంగ్ మంచి మాస్ బీట్ తో యువత, మాస్ ఆడియన్స్ ని ఎంతో అలరిస్తుంది. రామ్ మిరియాల పాడడంతో పాటు స్వరపరిచిన ఈ సాంగ్ లో హీరో సిద్దు జొన్నలగడ్డ డ్యాన్స్ తో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ అందుకుంటోంది. కాగా టిల్లు స్క్వేర్ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి త్వరలో ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకురానున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు