రష్మిక బాటలో రుక్మిణి.. విమర్శలు తప్పవా?

రష్మిక బాటలో రుక్మిణి.. విమర్శలు తప్పవా?

Published on Feb 11, 2026 9:02 AM IST

Rukmini

కన్నడ భామలకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రష్మిక మందన్న ఇక్కడ స్టార్‌గా ఎదిగి, నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకోవడంలో తెలుగు ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించింది. అయితే, మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్న నెపంతో కన్నడ ప్రేక్షకులు ఆమెను సామాజిక మాధ్యమాల్లో తరచూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రతికూలతలను ఎదుర్కొంటూనే రష్మిక తన కెరీర్‌ను విజయవంతంగా మలుచుకుంది.

​ఇప్పుడు అదే బాటలో రుక్మిణి వసంత్ కూడా కనిపిస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి, ప్రస్తుతం ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు ‘కాంతార చాప్టర్ 1’తో కన్నడలోనూ స్టార్ హోదాను దక్కించుకుంది. తెలుగులో ఆమెకు పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే, త్వరలోనే ఆమె టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోయిన్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

​టాలీవుడ్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తుండటంతో, ఇక్కడ గుర్తింపు వస్తే బాలీవుడ్ ఆఫర్లు కూడా సులువుగా వస్తాయి. ఈ క్రమంలో రుక్మిణి కూడా రష్మికలాగే తెలుగు సినిమాలకే మొగ్గు చూపుతుందా లేక కన్నడ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆమె కూడా కన్నడను విస్మరిస్తే, అక్కడి ప్రేక్షకుల నుండి విమర్శలు తప్పవని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు