సాలిడ్ ఫిజిక్ తో రామ్ చరణ్ డాషింగ్ లుక్ వైరల్.!

సాలిడ్ ఫిజిక్ తో రామ్ చరణ్ డాషింగ్ లుక్ వైరల్.!

Published on Sep 1, 2023 7:00 AM IST

ramcharan 2

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై క్రేజీ అంచనాలు ఉండగా ఈ సినిమా విషయంలో అయితే రామ్ చరణ్ తన లుక్స్ పరంగా మంచి ట్రీట్ ని అయితే అందిస్తున్నాడు. మరి ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ నుంచి లేటెస్ట్ గా ప్రిపేర్ చేసిన కలెక్టర్ లుక్ వైరల్ గా మారింది.

రక్షా బంధన్ సందర్భంగా మెగా సిస్టర్స్ తమ మెగా బ్రదర్ చరణ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా అందులో చరణ్ అయితే ఆ బొట్టు లో మరింత డాషింగ్ గా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా సాలిడ్ ఫిజిక్ ని కూడా తాను మైంటైన్ చేస్తున్నట్లు గా ఈ పిక్ చూస్తే అర్ధం అవుతుంది. దీనితో చరణ్ ఈ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా మారింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు