బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ మూడో వారం నుంచి గోపీచంద్ మలినేని కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య పై సాంగ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అన్నట్టు సాంగ్ తో పాటు ఓ యాక్షన్ సీన్ ను కూడా షూట్ చేస్తారట. ఇక ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలయ్యను ఒక రాజుగా చూపించారు.
అలాగే, నయనతారని ఒక మహారాణి పాత్రలో కనిపించనుందని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. అన్నట్టు గతంలో బాలయ్య – నయన్ కలిసి ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.


