‘రామాయణ’ రన్‌టైమ్ చెప్పేసిన రణ్‌బీర్ కపూర్.. ఎంతంటే..?

‘రామాయణ’ రన్‌టైమ్ చెప్పేసిన రణ్‌బీర్ కపూర్.. ఎంతంటే..?

Published on Apr 5, 2026 2:00 AM IST

Ramayana

ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌరాణిక గాథగా రాబోతున్న ‘రామాయణ’ చిత్రంపై తాజాగా హీరో రణ్‌బీర్ కపూర్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రణ్‌బీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ఈ సినిమా రెండు భాగాల మొత్తం రన్ టైమ్ సుమారు ఆరు గంటల వరకు ఉంటుందని వెల్లడించాడు. అంతేకాకుండా, రెండో భాగానికి సంబంధించి తన పాత్రకు సంబంధించిన 50 శాతం చిత్రీకరణ కూడా అప్పుడే ముగిసిందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఈ చిత్రం మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ స్టూడియో ‘DNEG’ నిర్వహిస్తోంది. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం.. రెండు భాగాల మొత్తం బడ్జెట్ అక్షరాలా రూ.4000 కోట్లు. భారతీయ సినీ రంగంలో ఇప్పటివరకు ఏ సినిమాకూ ఇంత భారీ వ్యయం చేయలేదు.

ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల విషయానికొస్తే.. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించబోతుండగా, టాలెంటెడ్ నటి సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువల మధ్య, భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ ఎపిక్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు