కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన ఎస్ జె సూర్య మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం. అటు దర్శకుడిగానే కాకుండా ఇటు నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు ఎస్ జె సూర్య. ఇక ప్రస్తుతం లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో కీలక పాత్ర చేస్తున్నారు ఎస్ జె సూర్య. నేడు ఈ మూవీ యొక్క టీజర్ ని పలు భాషల్లో పలువురు స్టార్ నటులు విడుదల చేసారు.
జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్ నేడు విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఖుషి మూవీ ఎంతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. అలానే తమిళ్ లో అజిత్ గారికి, విజయ్ గారికి కూడా హిట్స్ ఇచ్చాను కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మాత్రం హిట్ ఇవ్వలేకపోయాను అన్నారు. ఆయనతో చేసిన నాని మూవీ పెద్దగా సక్సెస్ కానప్పటికీ మహేష్ నటనకు మంచి పేరు దక్కిందన్నారు. అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ కి సూపర్ హిట్ ఇచ్చితీరుతానని అన్నారు ఎస్ జె సూర్య.


