రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. సినిమా కి సూపర్ పాజిటివ్ టాక్ రావడం ఆడియెన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.
ఈ చిత్రం కి సంబందించిన ఒక లేటెస్ట్ వీడియో ను మేకర్స్ నేడు సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సలార్ యాక్షన్ ప్రోమో అది. వీడియో విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


