హాలీవుడ్ సినిమాలో ఎప్పుడో సక్సెస్ అయ్యిన ఫ్రాంచైజ్ వంటి చిత్రాల ఫార్మాట్ మన దగ్గర ఇప్పుడు బాగా ఊపందుకుంది. అయితే ఈ ఫ్రాంచైజ్ సీక్వెల్స్ పర్వంలో భారీ సినిమాలే కాకుండా పలు చిన్న ఇతర థ్రిల్లర్స్ కూడా ఇదే ఫార్మాట్ లో వస్తున్నాయి. అయితే బాహుబలి లాంటి సినిమానే పర్ఫెక్ట్ సీక్వెల్ అనుకున్న సమయంలో ఓ క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ మూవీ లవర్స్ ని కొన్నేళ్ల కితం ఆశ్చర్య పరిచింది. మరి ఆ చిత్రమే “దృశ్యం”.
ఒరిజినల్ మళయాళం నుంచి తెలుగు మరియు తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ లోకి తీసుకెళ్తున్నట్టుగా గత ఏడాది పనోరమా స్టూడియోస్ వారు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం గ్లోబల్ వైడ్ గా రీమేక్ హక్కులు అయితే వారు కొనుగోలు చేశారట. ఇది వరకే కొరియన్ భాషలో అనౌన్స్ చేయగా ఇప్పుడు హాలీవుడ్ లోకి ఫ్రాంచైజ్ గా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు కుమార్ మంగత్ పాఠక్ అలాగే అలాగే పనోరమా స్టూడియోస్ వారు ఇప్పుడు గల్ఫ్ స్ట్రీమ్ మరియు జోట్ ఫిల్మ్స్ వారితో కలిపి దృశ్యం చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారట. దీనితో హాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న మొట్ట మొదటి ఇండియన్ రీమేక్ గా దృశ్యం నిలిచింది అని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక క్యాస్టింగ్ ఇతర వివరాలు ఏంటి అనేవి మున్ముందు రివీల్ కానున్నాయి.


