టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్ విజేత, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సాధించిన వరల్డ్ కప్ మెడల్‌ను ధరించి వెంకీ కుడుముల ఫోటోలకు పోజులివ్వడం విశేషం.
ఈ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ వెంకీ కుడుముల ఎమోషనల్ అయ్యారు. ‘ఈ మెడల్ వెనుక ఏళ్ల కష్టం ఉంది. నా తమ్ముడు తిలక్ వర్మ సాధించిన ఈ అద్భుత క్షణంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. నీ గురించి ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’ అంటూ రాసుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధం మరియు స్నేహాన్ని చూసి అటు సినీ అభిమానులు, ఇటు క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు.
వెంకీ కుడుముల ప్రస్తుతం తన సొంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ప్రొడక్షన్స్ ద్వారా ‘ఇట్లు అర్జున’ అనే సినిమాతో నిర్మాతగా బిజీగా ఉన్నారు. మరోవైపు తిలక్ వర్మ వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా హీరోగా నిలిచాడు. ఈ ఇద్దరు సెలబ్రిటీల కలయికకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


