పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. దీంతో, సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘సలార్ 2’లో ప్రభాస్ లుక్ ను మార్చబోతున్నాడు ప్రశాంత్ నీల్. ‘సలార్ 1’లో రఫ్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. కానీ, సలార్ 2లోని కొన్ని సన్నివేశాల్లో మాత్రం ప్రభాస్ పాత్రకు న్యూ మేకోవర్ ఇస్తున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా ‘సలార్ 2’ ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కొత్తగా కనిపిస్తారని, ఆయనకు దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టైలిష్ లుక్ ను డిజైన్ చేయించాడని తెలుస్తోంది. అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్ కిరగందూర్ కూడా మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ లో ఈ సినిమా పార్ట్-2ని స్టార్ట్ చేసి.. 2025లో రిలీజ్ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉండనుందని ఆయన తెలిపారు.