మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak sen) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of godavari). ఈ చిత్రం ను మే 17, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరో విశ్వక్ సేన్ లంకల రత్న అనే పాత్రలో నటిస్తున్నారు. తన రోల్ కి బై బై చెబుతూ ఒక వీడియో ను షేర్ చేశారు. తన మీసాలు, గడ్డం ట్రిమ్ చేసిన వీడియో అది.
నేహ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Our Lankala Rathna ~ Mass Ka Das @VishwakSenActor is all set to arrive with #GangsOfGodavari at theatres near you on MAY 17th! ????????
In cinemas #GOGOnMay17th ???? pic.twitter.com/rmDff4Ppzx
— Sithara Entertainments (@SitharaEnts) April 14, 2024