సమీక్ష : సుకుమారుడు – సుకుమారంగా హింసిస్తాడు..

సమీక్ష : సుకుమారుడు – సుకుమారంగా హింసిస్తాడు..

Published on May 10, 2013 1:30 PM IST
sukumarudu2 విడుదల తేదీ : 10 మే 2013 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : అశోక్. జి
నిర్మాత : కె. వేణుగోపాల్
సంగీతం : అనూప్ రూబెన్
నటీనటులు : ఆది, నిషా అగర్వాల్, కృష్ణ, శారద..

‘ప్రేమ కావాలి’, ‘లవ్లీ’ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకున్న యంగ్ హీరో ఆది హ్యాట్రిక్ అందుకోవాలని చేసిన మూడవ ప్రయత్నం ‘సుకుమారుడు’. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్. జి దర్శకత్వం వహించిన ఈ సినిమాని వేణుగోపాల్ నిర్మించాడు. సూపర్ స్టార్ కృష్ణ, ఊర్వశి శారద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. పూర్తి హాస్యభరితంగా ఉండే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ‘సుకుమారుడు’ సినిమాతో ఆది హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఈ సినిమా కథ ఈ మధ్యే విడుదలైన ‘గ్రీకువీరుడు’ సినిమా మాదిరిగా ఉంది. బందాలను, అనుబందాలను లెక్కచేయని ఒక స్వార్ధపూరిత ఎన్నారై బందువులు ఇండియాకు రమ్మన్నా రాకుండా విదేశాలలోనే ఉంటాడు. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల తన ఆస్తి కోసం ఇండియాకి రావలనుకుంటాడు.

సుకుమార్(ఆది) కెరీర్లో సక్సెస్ అయిన పక్కా మనీ మైండెడ్ మనస్తత్వం గల వ్యక్తి. తన డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి తనకి త్వరగా కొంత డబ్భు అవసరం అవుతుంది. అదే సమయంలో తనకు వారి పల్లెటూరిలో వారసత్వంగా 150 కోట్ల ఆస్తి వస్తుందని తెలుస్తుంది. అతను ఆ ఆస్థి కోసం పల్లెటూరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అక్కడకు వెళ్లి తన నానమ్మని వందనమ్మ(శారద)ను కలుసుకుంటాడు. ఆ గ్రామస్తులందరూ ఆమెని ఎంతో గౌరవిస్తూ వుంటారు. సుకుమార్ ఆస్తి కోసం ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని ప్లాన్స్ ని తన మామయ్య రావు రమేష్, అతని బృందం అడ్డుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో శంకరి (నిషా అగర్వాల్), సుకుమర్ ల మద్య రొమాంటిక్ సన్నివేశాలు జరుగుతూ వుంటాయి. తన ప్లాన్ లో సుకుమార్ విజయాన్ని సాదించాడా? లేక అతని ప్లాన్స్ ని గ్రామస్తులు తెలుసుకున్నారా? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ కృష్ణ గారు కొద్ది నిముషాలు నటించినా మంచి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. విలక్షణ నటి ఊర్వశి శారద నటన బాగుంది. రావు రమేష్ తన పాత్రకి తన వంతు న్యాయం చేసాడు. ఆది డాన్సులు, ఫైట్స్ బాగా చేసాడు కానీ ఎమోషనల్ సీన్స్ చెయ్యడంలో కాస్త మెరుగుపరుచు కుంటే ఇంకా బాగుంటుంది.

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే బాగాలేదు. అలాగే లాజిక్ లేదు, సినిమా కోడా ఆగి ఆగి పోతున్న గూడ్స్ బండిలా సాగుతుంది. ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమాలో ఎక్కువ థీమ్ లైన్స్ ని చూపించడానికి ప్రయత్నించాడు – తండ్రి -కొడుకుల మద్య సెంటిమెంట్, నానమ్మ – మనవడి మధ్య సెంటిమెంట్, ఒక తెలివైన ఎన్.ఆర్.ఐ పల్లెటూరికి రావడం అక్కడ తన తప్పును తెలుసుకోవడంలాంటివి. మంచి థీమ్ లైన్స్ నే ఎంచుకున్నా వాటిని సరిగా చూపించక పోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఈ సినిమా కథలో కొన్ని లోసుగులున్నాయి. ఈ సినిమాలో వచ్చే చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా వున్నాయి. మెలోడ్రామా సన్నీ వేషాలను సాగదీయడం అలాగే ఎమోషినల్ సన్నివేశాలలో అవసరంలేని ఓవర్ యాక్షన్ వుంది. ఈ సినిమా పది నిమిషాలు తక్కువ మూడు గంటలు ఉంది, సినిమాలో చెప్పడానికి కథ ఏమీ లేకపోవడం వల్ల అంత సాగదీయడంతో చిరాకు పడుతుంది. ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు బాగా రాలేదు. టాలెంటెడ్ కామెడీ నటుల నటన వృదా అయ్యింది. ఆది, నిషా అగర్వాల్ ల మద్య రొమాంటిక్ సన్నివేశాలు అంట బాగాలేవు, అలాగే సరైన ముగింపు లేదు. వారిద్దరి మధ్యా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అంత బాగాలేదు. సినిమాలో సందర్భం లేకుండా వచ్చే పాటలు సినిమా వేగాన్ని తగ్గిస్తాయి.

సాంకేతిక విబాగం:

ఈ సినిమా సినిమాటోగ్రఫీ మాములుగా వుంది. ఎడిటింగ్ దారుణంగా వుంది. ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఈ సినిమా చూస్తుంటే ఆగి ఆగి ముందుకు పోతున్నట్టుగా ఉంటుంది. డైలాగులు పరవాలేదనిపించేలా వున్నాయి. అశోక్ కుమార్ దర్శకత్వం బాగోలేదు, అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా చూపించలేకపోయాడు. నిర్మాణ విలువలు పరవాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం ఒకే అనేలా ఉంది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద సౌండ్స్ తో వినడానికి కాస్త కష్టంగా ఉంది.

తీర్పు:

సుకుమారుడు సినిమా చాలా పెద్దగా ఉంది మీకు ఇబ్బందిని కలిగించే సినిమా. మీరు సుకుమారమైన టార్చర్ కావాలనుకుంటే వెళ్లి చూడండి, లేదంటే ఈ సినిమాకి దూరంగా ఉండండి.

123తెలుగు.కామ్ : రేటింగ్ 1.5/5

అనువాదం : నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు