“లోపలికి రా చెప్తా” నుంచి ‘మిషన్ కుట్టేటి సుందరి’ !

“లోపలికి రా చెప్తా” నుంచి ‘మిషన్ కుట్టేటి సుందరి’ !

Published on Mar 8, 2025 7:30 AM IST

sundar

మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ “లోపలికి రా చెప్తా”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా “లోపలికి రా చెప్తా” సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘మిషన్ కుట్టేటి సుందరి’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ పాటకు అలరాజు రాసిన లిరిక్స్, డేవ్ జాండ్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ ట్యూన్, వెంకట రాజేంద్ర పాడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట సక్సెస్ నేపథ్యంలో మూవీ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా తమ “లోపలికి రా చెప్తా” సినిమా ఉంటుందని, త్వరలో మంచి డేట్ చూసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు చెప్పుకోచ్చారు.

తాజా వార్తలు