కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో తన సెన్సేషనల్ హిట్ చిత్రం “జైలర్” సీక్వెల్ కూడా ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి రజినీకాంత్ స్టామినా ఏంటో చూపించింది. తెలుగులో కూడా ఈ చిత్రం 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సంచలన విజయం సెట్ చేసింది. అయితే ఇపుడు సీక్వెల్ ని అనౌన్స్ చేసాక మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఈ సీక్వెల్ పై ఇపుడు సాలిడ్ అప్డేట్ వచ్చింది. దీనితో రేపు సోమవారం నుంచే ఒక రెండు వారల షెడ్యూల్ తలైవర్ పై మొదలు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ రెండు వారాలు తర్వాత మరో షెడ్యూల్ లో రజినీకాంత్ లేని సీన్స్ ని ఇతర ఆర్టిస్ట్ లతో మేకర్స్ తెరకెక్కించనున్నారట. ఇక ఈ సినిమాలో కూడా పార్ట్ 1 లానే చాలా మంది స్టార్స్ కనిపించనున్నారట. మరి వాటిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


