యెల్‌ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏఎల్‌సిసి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ‘ఒక యంగ్‌స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి.’ అని అన్నారు.
హీరోయిన్ శ్రావణి శెట్టి మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. లేలీధర్ రావు గారు ఒక టీచర్.. అలాంటిది ఆయన ఒక ప్యాషన్ తో డైరెక్టర్ గా మారి ఈ సినిమా చేశారు. తప్పకుండా ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది.’ అని అన్నారు.
డైరెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే విషయం పక్కనపెడితే.. వైవిధ్యమైన సినిమాలను తప్పకుండా ప్రోత్సహించండి. ఈ సినిమా చిన్న సినిమా అయినా, ఒక వైవిధ్యమైన సినిమా. డైరెక్టర్ లేలీధర్ రావు కోలా చాలా బాగా తీశారు. నష్టాలు వస్తున్నాయని రైతు వ్యవసాయం ఆపడు. మేము కూడా అంతే. సినిమాలు ప్లాప్ అవుతున్నాయని సినిమాలు చెయ్యడం మానము. ఇంకా కొత్త కొత్త సినిమాలు చెయ్యడానికి ప్రయత్నిస్తాం.’ అని అన్నారు.
ఈ సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన నగేష్ గారికి, సముద్రాల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’ అని అన్నారు.


