‘కోర్ట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రియదర్శి ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.
ఈ క్రమంలో ఈ చిత్రం సెన్సార్ పనులు ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ఈ సినిమాలో రూపా కొడవయుర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.



