మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ లేని ‘హిట్-3’.. ఎక్కడంటే?

మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ లేని ‘హిట్-3’.. ఎక్కడంటే?

Published on Apr 23, 2025 12:03 PM IST

HIT3 M

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ఇప్పటికే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. అయితే, ‘హిట్-3’ చిత్రం ఒక ప్రాంతంలో కేవలం సింగిల్ స్క్రీన్స్‌లోనే రిలీజ్ కానుంది.

హిట్-3 చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో మంచి అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్‌ను అక్కడ మల్టీప్లెక్స్‌లలో రిలీజ్ లేకుండా కేవలం సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ చిత్రం ‘రైడ్-2’ కూడా మే 1న వస్తుండటంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ‘హిట్-3’ మూవీలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు