కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని.. సెట్ అయ్యేనా?

కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని.. సెట్ అయ్యేనా?

Published on Apr 24, 2025 2:07 AM IST

Nani Karthik Subbara

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఇతర భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు నాని. ఇక ఈ సినిమాను మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నాని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని చర్చలు జరుపుతున్నాడట. కార్తీక్ తనతో ఓ ఇంట్రెస్టింగ్ ఐడియా షేర్ చేశాడని.. దానిని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్లు నాని చెప్పుకొచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించే సినిమాలు తనకు చాలా బాగా నచ్చుతాయని నాని తెలిపాడు. కాగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘రెట్రో’ మూవీ కూడా మే 1న రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా కూడా బాగా ఆడాలని నాని కోరాడు.

ఇక త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అఫీషియల్ అప్డేట్ రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ‘హిట్-3’ మూవీలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు