ఆమెతో ఆ రిలేషన్‌ ఇప్పుడు లేదు – సిమ్రాన్

ఆమెతో ఆ రిలేషన్‌ ఇప్పుడు లేదు – సిమ్రాన్

Published on Apr 27, 2025 12:00 AM IST

Simran

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నాలుగు సీన్స్‌ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్‌ను ఉద్దేశించి తాజాగా సిమ్రాన్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. సిమ్రాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా తోటి నటి చేసిన కామెంట్స్‌ నన్నెంతో బాధించాయి. ఆ బాధతోనే ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో నాకు అనిపించింది చెప్పాను. కెరీర్‌ ఆరంభం నుంచి అడపాదడపా ఆంటీ రోల్స్‌లో యాక్ట్‌ చేస్తున్నాను’ అని సిమ్రాన్ అన్నారు.

సిమ్రాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘అలా యాక్ట్‌ చేయడంలో తప్పేముంది. ఆ రోల్స్‌ నాకు ఇష్టమే. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్‌ ఎప్పటికీ స్నేహితులు కాలేరు. నాకు ఎదురైన అనుభవంతో అది మరోసారి నిరూపితమైంది. స్నేహితులనుకున్నవాళ్లు కొన్ని సందర్భాల్లో తమ కామెంట్స్‌తో మనల్ని ఎంతో బాధిస్తారు. ఆ అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి నాకు మరోసారి ఫోన్‌ చేసింది. నేను ఏమీ ఇబ్బందిపడలేదు కానీ, ఆమెతో అంతకుముందు ఉన్న రిలేషన్‌ ఇప్పుడు లేదు’’ అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు