సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీవిష్ణు ‘సింగిల్’.. రన్‌టైమ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీవిష్ణు ‘సింగిల్’.. రన్‌టైమ్ ఎంతంటే?

Published on May 4, 2025 12:02 AM IST

single m

యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ రాజు డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను పూర్తిగా అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీవిష్ణు మార్క్ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాలో మనకు అందించబోతున్నారట. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 10 నిమిషాలుగా లాక్ చేశారట మేకర్స్.

ఈ సినిమాలో అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా మే 9న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు