నాగ్‌పూర్‌లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్

నాగ్‌పూర్‌లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్

Published on May 4, 2025 2:04 AM IST

Untitled 9 1

వేవ్స్ సమ్మిట్ 2025లో భారతీయ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అంతేగాక, ఈ వేదికపై అనేక కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. అయితే, తాజాగా ఈ వేదికపై మరో చారిత్రాత్మక విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా వెల్లడించాయి.

నాగ్‌పూర్‌లో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఈ రెండు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ప్రపంచానికి ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్‌గా భారత్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఈ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రకటనను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో రెండు సంస్థల నిర్మాతలు చేశారు. దీంతో భారత్‌లో రాబోయే కాలంలో సినిమా పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు