పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ సమయం తీసుకుంది. పవన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
అయితే, ఎట్టకేలకు పవన్ వీరమల్లు చిత్ర షూటింగ్‌ను ముగించాడు. కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా, పవన్ తాజాగా ఈ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశాడు. ఇక ఈ షూటింగ్ పూర్తి కావడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను మే 30 లేదా జూన్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.


