ముందు వీర.. తర్వాత గంభీర.. పవన్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్న ఓజి మేకర్స్

ముందు వీర.. తర్వాత గంభీర.. పవన్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్న ఓజి మేకర్స్

Published on May 27, 2025 11:00 AM IST

HHVM01

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్ట్ చేయగా స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ ‘ఓజి’ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడానికి రెడీ అవుతున్నాడు.

ఇలా రెండు వేర్వేరు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ ‘ఓజి’లో గ్యాంగ్‌స్టర్ అవతారంలో కనిపిస్తాడు. అయితే, ఈ చిత్ర యూనిట్ అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెంచేస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ముందు వీర రికార్డులు క్రియేట్ చేస్తే.. ఆ తర్వాత రికార్డులను తిరగ రాసేందుకు గంభీర వస్తున్నాడని ఓజి మేకర్స్ తాజాగా ట్వీట్ చేశారు.

ఇక హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు