‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ రిపోర్ట్.. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ రిపోర్ట్.. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Published on Mar 3, 2026 12:00 AM IST

vishnu vinyasam

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన జోరు ప్రదర్శిస్తోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్సిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది.

తొలి వీకెండ్ ముగిసే సరికి ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 14.7 కోట్ల మార్కును అందుకుంది. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా యువత కామెడీని ఎంజాయ్ చేస్తుంటే, కుటుంబ ప్రేక్షకులు సినిమాలోని ఎమోషనల్ కోర్‌ను మెచ్చుకుంటున్నారని వారు పేర్కొన్నారు.

సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించాడు. అయితే, ఈ సినిమాకు అసలు పరీక్ష నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. వీక్ డేస్‌లో ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు