పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర షూటింగ్‌ను పవన్ ఇటీవల తిరిగి ప్రారంభించాడు.
ప్రస్తుతం ముంబై తదితర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీపై కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాల్సింది. అయితే, ఈ షూటింగ్‌లో ఇమ్రాన్ పాల్గొనడం లేదు. దీనికి కారణం ఆయన అనారోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించాయని.. అందుకే ఆయన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.


