‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైద్యమైన సినిమాల్లో హీరోగా నటించి అలరించిన అర్జున్ అంబటి.. హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగశివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది ‘పరమపద సోపానం’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ లిరికల్ సాంగ్ ‘బూమ్ బూమ్’ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘బూమ్ బూమ్’ అంటూ సాగే ఈ పెప్పీ మాస్ నెంబర్ ను స్టార్ సింగర్ గీతా మాధురి ఆలపించారు. ఆమె మాట్లాడుతూ.. ” ‘పరమపద సోపానం’ లో ‘బూమ్ బూమ్’ అనే పాటని పాడాను. నాగ శివ గారు పూరి గారి వద్ద చాలా సినిమాలకు అసోసియేట్ గా వర్క్ చేశారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మనముందుకు ‘పరమపద సోపానం’ ని తీసుకొస్తున్నారు. ‘బూమ్ బూమ్’ పాటని చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. ఇది మంచి స్వింగ్ ఉన్న పాట. కచ్చితంగా ఈ పాట అందరినీ అలరిస్తుంది. టీం అందరికీ థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


