‘ఆంధ్రా కింగ్ తాలూకా’ యూఎస్ డీల్ పూర్తి!

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ యూఎస్ డీల్ పూర్తి!

Published on Jun 1, 2025 10:00 PM IST

andhra king

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఆంధ్రా కింగ్ తాలూకా”. రీసెంట్ టైటిల్ గ్లింప్స్ తోనే అదిరే రెస్పాన్స్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఈ సినిమా అక్కడ నుంచి సాలిడ్ బజ్ ని సొంతం చేసుకోగా మంచి బిజినెస్ ఆఫర్స్ కూడా అందుకోవడం మొదలు పెట్టింది.

ఇలా లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ డీల్ ని ఈ సినిమా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఇక రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా బాకీ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ – మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు