మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రం ‘పెద్ది’ పనుల్లో వేగం పెంచాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ తన డబ్బింగ్ పార్ట్‌ను స్టార్ట్ చేశాడు. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
మరోవైపు, ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ “రై రై రా రా” విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ పాటను నేడే(మార్చి 2) విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుండి ఎటువంటి కౌంట్‌డౌన్ పోస్టర్లు లేదా ప్రోమోలు రాకపోవడంతో, సాంగ్ విడుదల వాయిదా పడవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
ఈ పాటలో రామ్ చరణ్ తన గ్రేస్ మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించనున్నట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.


