రీషూట్ పనుల్లో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..?

రీషూట్ పనుల్లో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..?

Published on Jun 3, 2025 2:00 AM IST

Kingdom 4

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

అయితే, ప్రస్తుతం ఈ చిత్రం రీషూట్ జరుపుకుంటున్నట్లు సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యిందని.. అయితే, ఫైనల్ అవుట్‌పుట్‌లో కొన్ని సీన్స్ బాగా రాలేదని.. దానికోసమే మళ్లీ ఆ సీన్స్‌ను రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోవాలో ఈ రీ షూటింగ్ జరుగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ప్యాచ్ వర్క్ ముగిసిన తర్వాత ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు