డ్రగ్స్ తీసుకుంటే టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తాం – నిర్మాత దిల్ రాజు

డ్రగ్స్ తీసుకుంటే టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తాం – నిర్మాత దిల్ రాజు

Published on Jun 26, 2025 10:00 PM IST

Dil Raju

ప్రపంచ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం రోజును పురస్కరించుకుని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ నేతలు పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిలో సినిమా ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే, సినిమా ఇండస్ట్రీలో మాట్లాడి.. వారిని టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే మలయాళ సినీ పరిశ్రమ ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని పాటిస్తుందని.. త్వరలోనే తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని దిల్ రాజు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు